![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -645 లో.... అప్పుకి కళ్యాణ్ లంచ్ బాక్స్ తీసుకొని వస్తాడు. అది చూసి స్టేషన్ లోని వాళ్ళంతా మాట్లాడతారు. ఇలా మీరు భార్య భోజనం తీసుకొని రావడం గ్రేట్ అంటూ కళ్యాణ్ ని పొగుడుతారు. దాంతో అప్పు జెలస్ గా ఫీల్ అయి.. వాళ్ళని తిట్టి పంపిస్తుంది. ఎందుకు ఆలా కోప్పడుతున్నావ్ అని కళ్యాణ్ అంటాడు. మరి నా ముందు నిన్ను పొగుడుతుంటే నాకూ సిగ్గుగా ఉందంటూ అప్పు సిగ్గు పడుతుంది. మరోవైపు శృతి స్టాలు సెట్ చేస్తుంది. ఇది ఒకసారి వీడియో తీసి మేడమ్ కి పంపాలని శృతి వీడియో తీస్తుంటే.. నందగోపాల్ ఫోన్ మాట్లాడుతూ అడ్డు వస్తాడు. దాంతో పక్కకు జరగండి అంటూ శృతి చెప్తుంది. శృతి తీసిన వీడియోలో నందగోపాల్ ఉంటాడు.
మరొకవైపు ధాన్యలక్ష్మి బట్టలు సర్దుకుంటుంది. ఏం చేస్తున్నావంటూ ప్రకాష్ అడుగుతాడు. పెళ్లి అయినప్పటి నుండి ఇంతవరకు నా జీవితం ఎటు పోతందో అర్ధం అవడం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. ఎప్పుడు ఆస్తులు అవేనా.. రాజ్, కావ్య ఇంట్లో వాళ్ళు, చివరికి పనిమనిషి శాంత కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నారు.. నువ్వు తప్ప అంటు ధాన్యలక్ష్మితో ప్రకాష్ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. రేపు బ్యాంక్ వాళ్ళు ఇంటిని జప్తు చేస్తారని కావ్య బాధపడుతుంది. అప్పుడే కావ్యకి శృతి ఫోన్ చేస్తుంది. స్టాలు వీడియో పంపాను ఒకసారి చూడండి మేడమ్ అని అంటుంది. సరే అని కావ్య అంటుంది. రేపు ఆఫీస్ ని కూడా వాళ్లకు అప్పజెప్పాలని వాళ్ళకి తెలియక సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారని కావ్య అంటుంది. శృతి పంపిన వీడియో ఓపెన్ చేయగానే అందులో నందగోపాల్ కన్పిస్తాడు. అతన్ని చూసి షాక్ అయి రాజ్ కి చూపిస్తుంది. అయితే వీడు చనిపోలేదా ఎవరో ఇదంతా చేస్తున్నారు. మా ఫ్రెండ్ అబద్దం చెప్పాడు. ఈ నందగోపాల్ ని ఎలాగైనా పట్టుకోవాలని రాజ్, కావ్య అనుకుంటారు. రాజ్ కావ్య లు అప్పుని కలిసి జరిగిందంతా చెప్తారు. తన పోలీస్ ఫ్రెండ్ ఇలా అబద్దం చెప్పాడని రాజ్ చెప్తాడు. సరే నేను వాడిని పట్టుకుంటానని అప్పు అంటుంది.ఆ తర్వాత కానిస్టేబుల్ సీఐ కాల్ లిస్ట్ తీసుకొని వచ్చి అప్పుకి ఇస్తుంది. అందులో నందగోపాల్ , సీఐ లు డబ్బు గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు మీట్ అవుతున్న విషయం అప్పుకి తెలుస్తుంది. అప్పుడే సీఐ అప్పు దగ్గరికి వచ్చి లీవ్ కావాలని అడుగగా.. తను సరే అంటుంది.
దుగ్గిరాల కుటుంబం మొత్తం హాల్లో ఉంటారు. బ్యాంక్ వాళ్ళు వచ్చి ఈ ఆస్తులకు అమౌంట్ సెట్ అవట్లేదు. ఇంట్లో నగలు తీసుకొని రమ్మని చెప్తారు. మరొకవైపు అప్పు సీఐని ఫాలో అవుతుంది. అందరు మెడలోని నగలు తీసి అక్కడ పెడతారు. కావ్య పక్కకి వెళ్లి అప్పుకి కాల్ చేస్తుంది. తరువాయి భాగంలో ఇచ్చిన మాట కోసం సర్వస్వం వదిలేస్తున్నావ్.. నువ్వు గ్రేట్.. నువ్వు ఎక్కడ ఉంటే నేను నేను అక్కడే ఉంటానని సీతారామయ్యతో ఇందిరదేవి అంటుంది. సీతారామయ్య సంతకం పెడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |